జర్నలిస్టులకు జలదృశ్యం


చుక్కనీరు లేకుండా ఎండిపోయిన ఎగువ గోదావరిని 115 కిలోమీటర్ల మేర నిండు గంగాళంలా మార్చిన కాళేశ్వరం ప్రాణధార ప్రాణహిత జలదృశ్యాన్ని మీడియా ప్రతినిధులకు చూపేందుకు సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. జలభోజనాలు పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ప్రణాళిక సిద్ధంచేశారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల నుంచి ఎడిటర్లు, బ్యూరో చీఫ్లు, సీనియర్ రిపోర్టర్లు, ముఖ్య ప్రతినిధులను హెలికాప్టర్లు, బస్సుల ద్వారా కాళేశ్వర ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ విషయమై ప్రగతిభవన్లో ప్రజాసంబంధాల అధికారులతో చర్చించారు. ఎడిటర్లు, ఇతర మీడియా ప్రముఖులను మూడు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా, మిగతా ప్రతినిధులను ప్రత్యేక బస్సుల్లో కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్లు, పంఏహౌస్ల సందర్శనకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. బస్సులో వెళ్లే ప్రతినిధుల పర్యటన రెండురోజులు, హెలికాప్టర్లో వెళ్లే ప్రతినిధుల పర్యటన ఒకరోజు ఉండే అవకాశం ఉన్నది. వాతావరణ పరిస్థితులనుబట్టి నెలాఖరునకానీ, ఆగస్టు తొలివారంలోగానీ ఈ పర్యటన ఉండనున్నదని సమాచారం. గోదావరిపై బాబ్లీ తదితర అనేక ప్రాజెక్టులతో మహారాష్ట్రను దాటి నదీప్రవాహం దిగువకు రావడం లేదు. ప్రస్తుతం బాబ్లీ గేట్లు ఎత్తి ఉం చినా నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నిల్వ డెడ్ స్టోరేజీలోనే ఉన్నది. ఎగువ గోదావరి నుంచి చుక్క నీరు దిగువకు రావడం లేదు. సీఎం కేసీఆర్ దార్శనికతతో అంచనా వేసినట్టుగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాణహిత నది ప్రాణాధారంగా మారింది. అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల పరీవాహకం నుంచి 700 కిలోమీటర్ల ఎగువన పెన్గంగా, వార్ధా నదుల సంగమం తర్వాత ప్రారంభమైన ప్రాణహిత కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరిలో కలుస్తున్నది. ఈ ఏడాది కొంత ఆలస్యంగా ప్రారంభమైన ప్రాణహిత వరదజలాలను ప్రస్తుతం మే డిగడ్డ బరాజ్ దగ్గర నిలువరిస్తున్నారు. అక్కడినుంచి ఎత్తి గోదావరి ఒడిలోకి పోస్తున్నారు. ప్రాణహిత జలాలు అన్నారం, సుందిల్ల బరాజ్లకు చేరడంతో ఎండిపోయిన ఎగువ గోదావరి జలకళను సంతరించుకుంటున్నది. ఎత్తిపోతల ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్ వరకు ఇప్పటికే 20 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాణహిత నీళ్లను ఎత్తిపోయడం ద్వారా గోదావరి నదిలో మేడిగడ్డ బరాజ్ నుంచి ఎల్లంపల్లి వరకు ప్రస్తుతం 115 కిలోమీటర్ల మేర జలాలు నిండి జలకళ ఉట్టిపడుతున్నది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. వేల సంఖ్యలో తరలివస్తున్న ప్రజలతో మూడు బరాజ్ల వద్ద జాతర దృశ్యాలు కనిపిస్తున్నాయి. పంపుహౌస్లు, బరాజ్ల దగ్గర వనభోజనాలు కొ నేపథ్యంలో తెలంగాణతోపాటు దేశానికే గర్వకారణంగా నిలిచిన కాళేశ్వరం జలదృశ్యాన్ని మీడియా ప్రతినిధులకు చూపించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని సమాచారం.